ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్ పెళ్లి.. అతనే ఫిక్సా? | Anirudh Ravichander and Kavya Maran getting married in this year | Sakshi
Sakshi News home page

Kavya Maran: ఈ ఏడాదిలోనే కావ్య మారన్ పెళ్లి.. వరుడు అతడేనా?

May 22 2026 5:06 PM | Updated on May 22 2026 6:12 PM

Anirudh Ravichander and Kavya Maran getting married in this year

గతేడాది నుంచి ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఓసారి వీరిద్దరు న్యూయార్క్‌లో జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కూడా వీరిద్దరి గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకీ ఎవరా ఇద్దరని అనుకుంటున్నారా? గతేడాది నుంచి వైరలవుతోన్న ఆ జంట మరెవరో కాదు.. ఒకరు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్ రవిచందర్.. మరొకరు ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్య మారన్.

గతంలో కావ్య మార‌న్-  అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోష‌ల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత అనిరుధ్ అదేం లేదంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి టాపిక్ వైరల్‌గా మారింది. ఈ సారి ఏకంగా వేదికలను కూడా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్‌ నడుస్తోంది.

k

తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఇద్దరి కుటుంబాలు స్పెయిన్‌లో వీరి వివాహం జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  అయితే ఈ వివాహానికి సంబంధించి అనిరుధ్ కానీ.. కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. గతంలో చాలాసార్లు రూమర్స్‌ రావడంతో ఇది కూడా అలాంటిదేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిరోజులు ఆగితే ఈ జంట రిలేషన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక ఇద్దరి కెరీర్ పరంగా చూస్తే అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్నారు. కావ్య సైతం ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లతో ఫుల్ బిజీగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement