సెలబ్రిటీ మేనేజర్‌గా దూసుకుపోతున్న అంబటి శివ | Ambati Shiva rising as a celebrity manager | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ మేనేజర్‌గా దూసుకుపోతున్న అంబటి శివ

Nov 9 2025 7:39 AM | Updated on Nov 9 2025 7:39 AM

Ambati Shiva rising as a celebrity manager

సెలబ్రిటీలను చూడాలనేది కోట్లాది మందికి కల కావొచ్చు.. అయితే.. సెలబ్రిటీల పాపులారిటీ లో కలర్‌ఫుల్‌ కెరీర్‌ను చూడటం అనేది అతి కొద్దిమందికి మాత్రమే అబ్బిన కళ. అలాంటి కళని అవపోసన పట్టిన ఓ కుర్రాడు ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్‌గా సిటీలో దూసుకుపోతున్నాడు. పిన్న వయసులోనే పెద్ద పెద్ద స్టార్లతో శెభాష్‌ అనిపించుకుంటూ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ రంగం వైపు చూస్తున్న యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. దక్షిణాదిలో సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ అనే పదం అంతగా వినపడని రోజుల్లోనే షోకేస్‌ అనే సంస్థ స్థాపించిన అంబటి శివ ఈ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు అవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నాడు.

చాలా మంది తెలుగు కుర్రాళ్లలాగే నేను కూడా డిగ్రీ పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగంలో సెటిలవుదాం అనుకున్నా. అయితే ముంబై వెళ్లడంతో నా ఆలోచనతో పాటు తలరాత కూడా మారింది. తొలుత బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌ జోహర్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ సినిమాకి పని చేశాను. అక్కడే నాకు సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ అనే రంగం గురించి తెలిసింది. ఆ సమయంలో జాన్వీ, రకుల్‌ ప్రీతి సింగ్‌ వంటి తారలతో పనిచేశాను. ఆ తర్వాత వాళ్లు దక్షిణాది నటీనటులను హ్యాండిల్‌ చేయడానికి ఒక విభాగం ఏర్పాటు చేశారు. దానికి నన్ను కీలక బాధ్యతల్లో పెట్టారు. అదే సమయంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌లో రానా ఆరి్టస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నుంచి పిలుపుతో నగరానికి వచ్చేశాను. ఆ తర్వాత ‘షోకేస్‌’ స్థాపించాను. అనేక రకాల సెలబ్రిటీ ఈవెంట్స్‌ నిర్వహించాను. ముఖ్యంగా గద్దర్‌ అవార్డ్స్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ బీచ్‌ ఫెస్టివల్, కాకినాడ బీచ్‌ ఫెస్టివల్, ఫ్లెమింగోస్‌ బర్డ్స్‌ ఫెస్టివల్‌(మూడుసార్లు) చేశాం.  

ఏం చేస్తామంటే..
ఒకప్పుడు ఈవెంట్లలో సెలబ్రిటీల ఒప్పందాల వరకే చూసేవాళ్లం అయితే ఇప్పుడు ఇది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ మేనేజ్మెంట్‌ కూడా. ఎవరైనా ఒక సెలబ్రిటీతో ప్రోగ్రామ్‌ నిర్వహించాలనుకుంటే మొత్తం డిజైన్‌ చేసి అందిస్తాం. ప్రొడక్షన్, సెట్‌ డిజైనింగ్, నిర్వహణ అంతా మేమే చూసుకుంటాం. ఇక కార్యక్రమంలో ముఖ్యమైన భాగం సెలబ్రిటీలతో నిర్వాహకులకు మధ్య వారధిగా పనిచేయడం. ఆ తర్వాత సెలబ్రిటీలను కార్యక్రమానికి తీసుకురావడం నుంచి తిరిగి వెళ్లేవరకూ బాధ్యత తీసుకుంటాం.  

గ్లామరస్‌ కెరీర్‌.. 
డిజిటల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్ఫోటనం ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ఎకోసిస్టమ్‌ భారీ పెరుగుదలతో సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ను కీలకమైన, బహుముఖ వృత్తిగా మార్చింది. నైపుణ్యం కలిగిన యువతకు అధిక డిమాండ్‌ సృష్టించింది. దేశంలో దాదాపు 78కోట్లకు పైగా ఉన్న ఇంటర్నెట్‌ వినియోగదారుల వల్ల ఇంటర్నెట్‌ ప్రకటనల రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మారింది. దీంతో యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఓటీటీ వేదికలపై బ్రాండ్‌ ఒప్పందాలు, కంటెంట్‌ సృష్టి  ఆదాయ మార్గాలను అన్వేషించడానికి సెలబ్రిటీలకు ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ తప్పనిసరి అయ్యింది. మరోవైపు దేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య 4 మిలియన్లకు పైగా పెరిగింది. ఇది కంటెంట్‌–ఆధారిత బ్రాండ్‌ సహకారాల కోసం ఒక భారీ పరిశ్రమను సృష్టించింది. ఈ బూమ్‌ కొత్త డిజిటల్‌ స్టార్‌ల కోసం బ్రాండ్‌ ఒప్పందాలు, కాంట్రాక్టులు కెరీర్‌ వ్యూహాన్ని నిర్వహించడానికి వందలాది మంది టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలు, మేనేజర్లను నియమించుకోవడానికి దారితీసింది.  
– అంబటి శివ   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement