సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌ హాజరు | Allu Arjun appears virtually before the Nampally Court | Sakshi
Sakshi News home page

Allu Arjun: సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌ హాజరు

Jun 22 2026 4:53 PM | Updated on Jun 22 2026 5:00 PM

Allu Arjun appears virtually before the Nampally Court

సంధ్య థియేటర్‌ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్‌ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ విచారణకు హాజరైన నిందితులంతా న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జులై 6కి వాయిదా వేశారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కాగా.. 2024 డిసెంబర్‌ 4న పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement