ఆ కారణంతో నాన్న మద్యానికి బానిసయ్యారు: స్టార్ హీరోయిన్ | Alia Bhatt Interesting Comments About Her Father Mahesh Bhatt | Sakshi
Sakshi News home page

Alia Bhatt: సినిమాలన్నీ ఫ్లాఫ్.. ఆర్థిక ఇబ్బందులు: ఆలియా భట్

Oct 1 2023 1:00 PM | Updated on Oct 1 2023 1:33 PM

Alia Bhatt Interesting Comments About Her Father Mahesh Bhatt - Sakshi

బాలీవుడ్ భామ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీకి ప్రేమ కహానీ చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ.. బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ కూతురిగానే ఇండస్ట్రీకి పరిచయమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భామ.. తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.   

(ఇది చదవండి: నా ఎఫైర్స్‌ గురించి పిల్లలకు చెప్పేశా.. ఎందుకంటే?: రవీనా టండన్‌ )   

అలియా భట్ మాట్లాడుతూ.. 'గతంలో నాన్న  చాలా సినిమాలు తెరకెక్కించారు.  పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ల్స్‌గా నిలిచాయి. దీంతో నాన్న మద్యానికి బానిసయ్యారు. అదే సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.  కానీ కొద్ది రోజుల తర్వాత మద్యం మానేశారు. ఆ తర్వాత అమ్మా, నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని ఒడుదొడుకులు అధిగమించి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా చేసిన కామెంట్స్ బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. 

అంతే కాకుండా తన తల్లి సోనీ రజ్దాన్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  అమ్మ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఎవరు తెలియదని చెప్పింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందని పేర్కొంది.  థియేటర్స్, సినిమాలు, టీవీలతో పాటు చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చేదని తెలిపింది.  సినిమాల కోసం కష్టపడటం అనే విషయాన్ని అమ్మ దగ్గరే నేర్చుకున్నా అని ఆలియా వెల్లడించింది. 

(ఇది చదవండి: నడిరోడ్డుపై జరిగే అత్యాచారానికి ఇదేమీ తక్కువ కాదు: నటి)   

Advertisement
 
Advertisement
Advertisement