నా ఎఫైర్స్‌ గురించి పిల్లలకు చెప్పేశా.. ఎందుకంటే?: రవీనా టండన్‌ | Raveena Tandon: Never Hide Past Relationship from Children | Sakshi
Sakshi News home page

Raveena Tandon: పిల్లల దగ్గర ఏదీ దాచను.. నా లవ్‌ బ్రేకప్‌లు, డేటింగ్‌లు అన్నీ చెప్పేశా..

Oct 1 2023 12:13 PM | Updated on Oct 1 2023 12:33 PM

Raveena Tandon: Never Hide Past Relationship from Children - Sakshi

అది చూసి నా కూతుర్లు కంగారుపడొద్దు. అందుకే వారికంటే ముందే నేనే అన్ని నిజాలు పిల్లలకు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం

లవ్‌ బ్రేకప్‌.. ఇప్పుడిది చాలా కామన్‌ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో అయితే ఒకటీరెండు కాదు లెక్కలేనన్ని బ్రేకప్‌లు ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీలు ఎన్నో బ్రేకప్‌లు చూసి వచ్చినవాళ్లే! అయితే ప్రేమ విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడేందుకు అందరూ ఇష్టపడరు. కానీ తను మాత్రం తన ఎఫైర్స్‌ను సైతం పిల్లలతో షేర్‌ చేసుకుంటానంటోంది హీరోయిన్‌ రవీనా టండన్‌.

పెళ్లికి ముందే డేటింగ్‌, బ్రేకప్‌
90'sలో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందిన రవీనా టండన్‌.. అక్షయ్‌ కుమార్‌ను ప్రేమించింది. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. వీరిద్దరూ మొహ్రా సినిమాలో కలిసి నటించారు. ఆన్‌స్క్రీన్‌పై జోడీ కట్టిన వీరు రియల్‌ లైఫ్‌లోనూ పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రకటించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే బ్రేకప్‌ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత ఇద్దరూ చెరొకరిని చూసుకుని మళ్లీ డేటింగ్‌ రూట్‌లో నడిచారు.

అన్నీ చెప్పేస్తా, లేదంటే..
కట్‌ చేస్తే తన ప్రేమకహానీలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ 2004లో  బిజినెస్‌మెన్‌ అనిల్‌ తడానీని పెళ్లి చేసుకుంది. వీరికి రాశా, రణ్‌బీర్‌ వర్దన్‌ సంతానం. పెళ్లికి ముందే 1995లో ఇద్దరు చిన్నారుల(పూజ, ఛాయ)ను దత్తత తీసుకుని వారికి తల్లయింది రవీనా. అయితే తన పిల్లల దగ్గర గతంలోని ప్రేమకథలతో సహా ఏదీ దాచనంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా ఎఫైర్స్‌ గురించి పేపర్లో కథలు కథలుగా రాస్తారు. అలాంటప్పుడు నేను తప్పించుకోలేను. అది చూసి నా పిల్లలు కంగారుపడొద్దు. అందుకే పత్రికలవారికంటే ముందే నేనే అన్ని నిజాలు పిల్లలకు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా ఎలాగోలా తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారుతాయి.

చెత్తగా రాశారు
90'sలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. నా గురించి చెత్తగా రాశారు. బాడీ షేమింగ్‌ చేశారు. ఇష్టమొచ్చిన పేర్లు పెట్టేవారు. నిజానిజాలు కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేవారు. ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చాక కనీసం మా వర్షన్‌ చెప్పుకోవడానికైనా వీలవుతోంది' అని చెప్పుకొచ్చింది హీరోయిన్‌. రవీనా టండన్‌ ప్రస్తుతం వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ సినిమా చేస్తోంది.

చదవండి: ఏడేళ్లుగా సినిమాలకు దూరమైన హీరోయిన్‌.. ఈరోజే బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement