నాగచైతన్య తండేల్.. నిజమైన తండేల్ రాజ్‌ను చూశారా? | Akkineni Naga Chaitanya Thandel Movie Real Person Thandel Raj Video Viral | Sakshi
Sakshi News home page

Thandel Movie: తండేల్ మూవీ.. రియల్ తండేల్ రాజ్ ఎలా ఉన్నాడంటే?

Feb 3 2025 3:24 PM | Updated on Feb 3 2025 4:36 PM

Akkineni Naga Chaitanya Thandel Movie Real Person Thandel Raj Video Viral

అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ మూవీతో(Thandel Movie) ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తండేల్ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

అయితే ఈ చిత్రాన్ని యధార్థ కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. కొందరు భారత జాలర్లు పాక్‌ భూభాగంలోకి పొరపాటున వెళ్లడంతో వారందరినీ పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తండేల్‌ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్)

ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రియల్ తండేల్ రాజ్(తండేల్ రామారావు) హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు కూడా సినిమాలో అవకాశం ఇస్తే బాగుంటుందని తండేల్ రామారావు అన్నారు. తండేల్-2 లోనైనా నాకు ఏదైనా పాత్ర ఇచ్చినా ఫర్వాలేదని ఆయన అన్నారు. దీనికి తండేల్ రాజు భార్య మాట్లాడుతూ.. మీరు మళ్లీ పాకిస్తాన్ వాళ్లకి దొరికితేనే సాధ్యం అంటూ ఫన్నీగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement