లైగర్ భామతో డేటింగ్‌.. యంగ్ హీరో రిప్లై ఇదే ! | Aditya Roy Kapur Comments About Dating Rumours With Ananya Panday - Sakshi
Sakshi News home page

Aditya Roy Kapur: సీక్రెట్స్ అడగొద్దు.. కచ్చితంగా అలా మాత్రం చెప్పను!

Published Tue, Dec 12 2023 1:32 PM

Aditya Roy Kapur Comments About Dating Rumours With Ananya Panday - Sakshi

బాలీవుడ్‌ తారలే కాదు.. సినీ ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ తరచుగా వినిపిస్తుంటాయి. అలా రూమర్స్ కొన్నిసార్లు నిజమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే రూమర్స్‌తో మొదలైన పెళ్లిబంధంతో ఒక్కటైన బాలీవుడ్‌ జంటలు కూడా ఉన్నాయి. వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా, ఇటీవలే పెళ్లి చేసుకున్న రణ్‌దీప్‌ హుడా-లైస్రామ్ కూడా ఉన్నారు. తాజాగా ఈలిస్ట్‌లో లైగర్ భామ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ చేరిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతంలో అనన్య బర్త్‌డేను విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే ఎక్కడా కూడా తమ రిలేషన్‌పై నోరు విప్పలేదు.

అయితే తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ టాక్ షోకు హాజరైన ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అర్జున్ కపూర్‌తో కలిసి పాల్గొన్న ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అనన్యతో డేటింగ్‌ గురించి ప్రశ్నలు సంధించారు కరణ్ జోహార్. అయితే ఆ ప్రశ్నకు ఆదిత్య రాయ్ కపూర్‌ చాలా ఫన్నీగా సమాధానమిచ్చారు. 

ఆదిత్య మాట్లాడుతూ..'నన్ను రహస్యాలు మాత్రం అడగవద్దు. అయితే నేను కచ్చితంగా అబద్ధాలైతే మాత్రం చెప్పను' అని అన్నారు. అంతే కాకుండా తన మాజీ లవర్ శ్రద్ధా కపూర్‌ గురించి కూడా ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు కరణ్. మీరు అనన్య పాండే, శ్రద్ధా కపూర్‌తో కలిసి లిఫ్ట్‌లో చిక్కుకుంటే.. ఏం చేస్తారని ఆదిత్యను అడిగారు. అయితే దీనికి పక్కనే ఉన్న అర్జున్ కపూర్ ఫన్నీ ఆన్సరిచ్చాడు. 'కచ్చితంగా రొమాన్స్ చేస్తాడు.. కానీ ఎవరితో చేస్తాడో మాత్రం తెలియదు'.. ఐ యామ్ జస్ట్ జోకింగ్ అని నవ్వుతూ చెప్పాడు. 

అనన్య, ఆదిత్య రిలేషన్

కాగా.. లైగర్ భామ అనన్య, ఆదిత్య రాయ్ కపూర్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉ‍న్నారు. గతేడాది కృతి సనన్ దీపావళి పార్టీలోనూ జంటగా కనిపించారు. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చాలాసార్లు విదేశాలకు వెళ్తూ విమానాశ్రయాల్లో జంటగా కనిపించారు. అంతకు ముందే సారా అలీఖాన్‌తో కలిసి అనన్య పాండే సైతం కాఫీ విత్‌ కరణ్‌ షోకు హాజరైంది. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఎపిసోడ్‌ డిసెంబర్ 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. మరోవైపు ప్రస్తుతం ఆదిత్య, అనన్య  సినిమాలతో బిజీగా ఉన్నారు. అనన్య పాండే నటించిన  డ్రీమ్‌ గర్ల్‌  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Advertisement
 
Advertisement