హీరామండి సక్సెస్‌.. అవకాశాలు మాత్రం నిల్‌: అదితిరావు హైదరి | Aditi Rao Hydari opens up about career gap after Heeramandi success | Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: హీరామండి సక్సెస్‌.. అవకాశాల కోసం వెయిటింగ్: అదితిరావు హైదరి

Jun 17 2025 2:57 PM | Updated on Jun 17 2025 4:49 PM

Aditi Rao Hydari opens up about career gap after Heeramandi success

బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింగి. హీరో సిద్ధార్థ్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె చివరిసారి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో కనిపించింది. ఈ సిరీస్‌లో తన నటనకు గానూ  ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సిరీస్‌ తర్వాత పెళ్లి చేసుకున్న బ్యూటీ.. ఇప్పటి వరకు ఎలాంటి కొత్త సినిమాను ఓకే చేయలేదు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో అదితి రావు హైదరీ వెల్లడించింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడింది.

అదితి రావు మాట్లాడుతూ.. ' హీరామండి తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే చాలా ప్రేమ, ప్రశంసలు వచ్చాయి. అయితే నేను నా నెక్ట్స్‌ ఎలాంటి సినిమాకు ఇప్పటి వరకు సంతకం చేయలేదు. ఇంకా అవకాశాల కోసం వేచి ఉన్నా. జీవితంలో సమాన భాగస్వామిలాగే తెరపై మహిళలకు కూడా సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నా' అని పంచుకుంది.

కాగా.. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, తహా షా బాదుస్షా, అదితి రావు హైదరీ కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రస్తుతం అదితి రావు హైదరి 'ఓ సాథీ రే'లో అనే సిరీస్‌లో నటించనుంది. ఆ తర్వాత 'పరివారిక్ మనురంజన్' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement