'విక్రమ్' విలన్‌తో రాజశేఖర్ కూతురు కొత్త సినిమా | Actress Shivathmika to pair up with Arjun Das - Sakshi
Sakshi News home page

Shivathmika: హీరోయిన్ శివాత్మికకి అక్కడ వరస ఛాన్సులు

Aug 22 2023 3:00 PM | Updated on Aug 22 2023 3:08 PM

Actress Shivathmika New Movie With Arjun Das - Sakshi

గేంబ్రియో పిక్చర్స్‌ పతాకంపై సుధా సుకుమార్‌ నిర్మిస్తున్న తొలి చిత్రం ఆదివారం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు అర్జున్‌ దాస్‌, శివాత్మిక రాజశేఖర్‌ జంటగా నటిస్తున్న ఇందులో నాజర్‌, కాళీ వెంకట్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌ వెంకట్‌ దర‍్శకుడు. 

(ఇదీ చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్)

ఈ చిత్ర విశేషాల గురించి మాట్లాడిన డైరెక్టర్.. చక్కని వినోదంతో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డ్రామా ఇది అని అన్నాడు. ఈ చిత్రంలో మంచి విషయం ఉందని, నటుడు నాజర్‌ లాంటి సీనియర్స్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని అర్జున్‌ దాస్‌ ఆనందం వ్యక్తం చేశాడు. సంగీత దర్శకుడు డి.ఇమాన్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలో తాను నటించడం ఆనందంగా ఉందన్నాడు. తమిళంలో ఇప్పటికే రెండు మూవీస్ చేసిన శివాత్మిక.. తెలుగులో కంటే తమిళంలోనే బిజీ అవుతుందా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement