నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్ | Actress Kriti Kharbanda About Hidden Camera Incident - Sakshi
Sakshi News home page

Kriti Kharbanda: 'తీన్‌మార్' హీరోయిన్‌ని భయపెట్టిన ఆ సంఘటన!

Published Tue, Aug 22 2023 1:48 PM

Actress Kriti Kharbanda About Hidden Camera Incident - Sakshi

సినిమా హీరోహీరోయిన్లు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అభిమానులం అని చెప్పి కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. దాదాపు ప్రతి హీరోహీరోయిన్ ఏదో ఓ సందర్భంలో ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు ఓ సినిమా షూటిం‍గ్ టైంలో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి బయటపెట్టింది.

(ఇదీ చదవండి: చిరంజీవి బర్త్‌డే.. కూతురు ఫొటో పోస్ట్ చేసిన చరణ్)

ఎవరీ బ్యూటీ?
దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా.. 'బోణీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. దీంతో పాటు అలా మొదలైంది, తీన్ మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈమె అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్స్ పడకపోవడం వల్ల ఇక్కడ ఛాన్సులు రాలేదు. దీంతో కన్నడ, హిందీలో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

సీక్రెట్ కెమెరా 
'గతంలో ఓ కన్నడ సినిమా షూటింగ్ టైంలో జరిగిన సంఘటనని నేను అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి నా గదిలో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అయితే హోటల్ రూంలో బస చేసేటప్పుడు చెక్ చేసుకోవడం నాకు, నా టీమ్‌కి అలవాటు. అలా పరిశీలిస్తుండగా కెమెరా బయటపడింది. సెట్-ఆఫ్ బాక్స్ వెనక అతడు ఉంచిన కెమెరా చూసి చాలా భయపడ్డాను. అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాను' అని కృతి కర్బందా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)

Advertisement
 
Advertisement