రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా? | Know Facts About Chiranjeevi 157 Movie Director Mallidi Vasishta In Telugu - Sakshi
Sakshi News home page

Chiru 157 Movie: 'బింబిసార' డైరెక్టర్‌కి బంపరాఫర్.. చిరునే మెప్పించాడంటే..!

Published Tue, Aug 22 2023 12:24 PM

Chiranjeevi 157 Movie Director Mallidi Vasishta Details - Sakshi

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త సినిమాల్ని ప్రకటించారు. అందులో ఒకటి ఆయన కూతురు సుస్మిత నిర్మిస్తోంది. దీనికి 'Chiru156' అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. అలానే 'బింబిసార' ఫేమ్ దర్శకుడు మల్లిడి వశిష్ట్‌తో చిరు కలిసి పనిచేయబోతున్నారు. దీనికి 'chiru157' అనేది వర్కింగ్ టైటిల్. అయితే రెండో మూవీకే చిరుతో కలిసి  బంపరాఫర్ కొట్టేసిన ఈ కుర్ర డైరెక్టర్ ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

(ఇదీ చదవండి: 'రీమేక్స్'... చిరుకు కలిసొచ్చాయా? ముంచేశాయా?)

20 ఏళ్ల తర్వాత
అప్పుడెప్పుడో 2003లో చిరు 'అంజి' అనే సోషియో ఫాంటసీ సినిమా చేశారు. ఆరేడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఆ సినిమా అప్పట్లో ఎందుకో సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో చిరు ఆ తరహా చిత్రాలు చేయడమే మానేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నారు. దీనికి వశిష్ట్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

హీరో నుంచి డైరెక్టర్
తెలుగులో పలు సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మల్లిడి సత్యనారాయణ కొడుకే వశిష్ట్. ఇప్పుడంటే దర్శకుడిగా ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి మల్లిడి వేణు పేరుతో తొలుత హీరోగా పరిచయమయ్యాడు. 16 ఏళ్ల క్రితం 'ప్రేమలేఖ రాశా' అనే మూవీలో నటించాడు. అందులో అంజలి హీరోయిన్‌. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ వర్కౌట్ కాకపోవడంతో వేణు నటన పక్కనబెట్టేశాడు.

(ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?)

ఒక్క సినిమాతో
యాక్టింగ్ నుంచి సైడ్ అయిన వేణు.. తన పేరుని వశిష్ట్‌గా డైరెక్షన్ రూట్‌లోకి వచ్చాడు. కథలు పట్టుకుని రవితేజ, అల్లు శిరీష్ లాంటి హీరోలతో సినిమాలు తీసే ప్రయత్నాలు చేశాడు. కానీ శిరీష్‌తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయి, బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. ఫైనల్‌గా ఇతడిని నమ్మిన కల్యాణ్ రామ్.. 'బింబిసార' చేసే ఛాన్స్ ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర ఇది సూపర్‌హిట్ కావడంతో వశిష్ట్ పేరు మార్మోగిపోయింది.

పోస్టర్ చూస్తుంటే
అయితే 'బింబిసార'తో సోషియో ఫాంటసీలో తన మార్క్ చూపించిన వశిష్ట్.. చిరుకు ఆ తరహా కథనే చెప్పాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఓ పెద్ద శిల.. దానిపై బంగారు నక్షత్రం గుర్తు.. అందులో పంచ భూతాలని సూచిస్తూ ఐదు గళ్లని నింపుతూ మధ్యలో త్రిశూలం ఉండటం చూస్తుంటే ఇదేదో పెద్ద ప్లానింగ్‌లా కనిపిస్తుంది. రెండో సినిమాకే మెగాస్టార్‌ని ఒప్పించాడంటే, వశిష్ట్ మరో హిట్ కొట్టడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేస్తే అప్పుడు స్టోరీ ఏంటనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది.

(ఇదీ చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?

Advertisement
 
Advertisement
 
Advertisement