అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్‌ కొట్టిన 'సమంత' | Actress Samantha likes an Instagram post Why | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్‌ కొట్టిన 'సమంత'

Apr 21 2025 1:07 PM | Updated on Apr 21 2025 3:05 PM

Actress Samantha likes an Instagram post Why

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని తెలిసిందే. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత సమాచారన్ని కూడా అభిమానులతో ఆమె పంచుకుంటారు. 2022లో మయోసిటిస్‌ వల్ల సమంత ఆరోగ్యం దెబ్బతింది. ఆ సమయం నుంచి ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్‌లను షేర్‌ చేయడంతో పాటు లైక్‌ కొట్టడం చేస్తూ ఉన్నారు. అయితే, ఇన్‌స్టాలో   వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై తెలుపుతూ వచ్చిన ఒక పోస్ట్‌ను ఆమె లైక్‌ చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భార్యను వదిలించుకునేందుకే భర్త మొగ్గు చూపుతున్నారనే ఒక సర్వే గురించి ఆ పోస్ట్‌లో ఉంది. దానిని సమంత లైక్‌ చేయడంతో వైరల్‌ అవుతుంది.

అలాంటి భర్తలే ఎక్కువగా ఉన్నారు
ఇన్‌స్టాగ్రామ్‌లో సక్సెస్‌ వెర్స్‌ పేరుతో ఉన్న ఒక  ఖాతాలో ఆ పోస్ట్‌ షేర్‌ చేశారు. అందులో ఎక్కువకగా హెల్త్‌తో పాటు కుటుంబ బంధాల గురించే కనిపిస్తూ ఉంటాయి.  ఈ క్రమంలో వారు ఒక సర్వే గురించి ఇలా పంచుకున్నారు. 'ఒక కుటుంబంలో భార్య  తీవ్ర అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే ఇష్టపడుతున్నాడు.  ఒకవేల భర్త అనారోగ్యానికి గురైతే భార్య మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. ఒక సర్వేలో ఇది నిర్ధారించబడింది. పురుషులు తమ భాగస్వామికి ప్రాణాంతక అనారోగ్యం వస్తే ఆమెను వదిలించుకునేందుకు ప్రతి వెయ్యి మందిలో 624 మంది ఉన్నారని గణాంకాలతో  సహా ఆ సర్వేలో చెప్పబడింది. 

భార్య ఆనారోగ్యం వల్ల చాలామంది పురుషులు భావోద్వేగ, శారీరక సాన్నిహిత్యం కోల్పోవడం వల్లే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనారోగ్యం సమయంలో భార్యను వదిలివేయడం వెనుక దాగి ఉన్న  పూర్తి విషయాలు ఇంకా ఏమున్నాయో  నేటి ప్రపంచానికి తెలుపుదాం.' అని సమంత లైక్‌ చేసిన పోస్ట్‌లో ఉంది. సుమారు 60 వేలకు పైగానే ఆ పోస్ట్‌ను లైక్‌ చేశారు. భర్తతో విడిపోయిన సమంత ఇలాంటి పోస్ట్‌ను లైక్‌ చేయడంతో నెట్టింట వైరల్‌ అవుతుంది.

2021లోనే తన భర్తతో విడిపోతున్నట్లు సమంత ప్రకటించారు. అయితే, 2022లో తను మయోసిటిస్‌ వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు. దానికి చికిత్స పొందుతూనే ఖుషి, శాకుంతలం సినిమాలు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో బిజీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement