రేణు దేశాయ్‌ తల్లి కన్నుమూత | Actress Renu Desai Mother Passed Away | Sakshi
Sakshi News home page

Renu Desai: రేణు దేశాయ్‌కు మాతృ వియోగం.. ఎమోషనల్‌ పోస్ట్‌

Nov 21 2024 7:43 PM | Updated on Nov 21 2024 8:08 PM

Actress Renu Desai Mother Passed Away

సినీ నటి రేణు దేశాయ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్‌ గురువారం నాడు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి, ఓం శాంతి అంటూ తల్లి పాత ఫోటోను షేర్‌ చేసిన రేణు దేశాయ్‌ కింది శ్లోకాన్ని కూడా పోస్టు కింద జత చేసింది.

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే||

మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదంటూ ఆది శంకరాచార్యుల మాటల్ని సైతం ఆ పోస్టులో పొందుపరిచింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement