
సినిమాల్లో పాపులారిటీ రాగానే చాలామంది అక్కడే సెటిలవుతారు. కానీ ప్రగతి మాత్రం (Pragathi Mahavadi) విభిన్నంగా ఆలోచించింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోయిన్‌గా, సహాయనటిగా పలు సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొంతకాలం యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. అంతలో లాక్‌డౌన్. అందరి జీవితంలోలాగే ప్రగతి జీవితంలోనూ కుదుపు. కానీ ఈ సమయాన్ని ఆమె వృథా చేయాలనుకోలేదు.
లాక్‌డౌన్‌తో లైఫ్ యూటర్న్
వీలైనంత ఎక్కువగా జిమ్‌లోనే గడిపింది. బరువులు ఎత్తే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదట్లో సరదాగా ఎక్సర్‌సైజ్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ పవర్ లిఫ్టింగ్ వైపు తనకు ఆసక్తి పెరిగింది. ఈ రంగంలో ఎదగాలని ఆశపడింది. అనుకున్నట్లుగానే ఓ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో మూడో స్థానంలో నిలిచింది. తర్వాత జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలో రెండో స్థానంలో నిలిచి వెండి పతకం అందుకుంది. తాజాగా మూడు, రెండు స్థానాలను దాటేసి ఏకంగా మొట్టమొదటి స్థానంలో నిలబడింది.
బంగారు పతకం గెల్చిన ప్రగతి
కేరళలో జరిగిన జాతీయ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ - 2025 పోటీలో బంగారు పతకం గెలుచుకుంది. 84 కిలోల బరువు ఎత్తే విభాగంలో ఆమెకు ఈ పతకం వరించింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ప్రగతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 50 ఏళ్లు వచ్చాక ఇంకేం చేస్తాం? అనుకునేవారికి ప్రగతి ఆదర్శం అని కామెంట్లు చేస్తున్నారు. ఓపక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెయిట్ లిఫ్టింగ్‌లో అవార్డులు కొల్లగొట్టడం మామూలు విషయం కాదని కొనియాడుతున్నారు. ప్రగతి చివరగా నారీ: ద ఉమెన్ (2025) సినిమా చేసింది.
చదవండి: అందరిముందే తిట్టిన ప్రేయసి.. నటుడి సలహాతో బ్రేకప్ చెప్పిన బిగ్‌బీ