
తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar) బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్‌జెండర్ కార్యకర్త, నామిస్ సౌత్ క్వీన్ ఇండియా అధ్యక్షురాలు నమిత మారిముత్తు కూడా పార్టీలో చేరారు. వారిద్దరిని తమిళనాడు బీజేపీ సాదరంగా ఆహ్వానించింది. కస్తూరి, నమితా మారిముత్తు నేటి నుంచి అధికారికంగా బీజేపీతో రాజకీయ ప్రయాణంలో చేరడం స్వాగతించదగిన పరిణామం అంటూ నైనార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. సినీ నటి కస్తూరికి ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో ఆమెకు గుర్తింపు ఉంది.