Bollywood Actress Esha Gupta Taking Hyperbaric Oxygen Therapy - Sakshi
Sakshi News home page

Esha Gupta: ముఖానికి మాస్క్.. ఈ నటికి కూడా ఆ వ్యాధి?

Jul 28 2023 8:39 PM | Updated on Jul 28 2023 9:07 PM

Actress Esha Gupta With Oxygen Mask - Sakshi

హీరోయిన్లని చూడగానే.. అబ్బా సూపర్ ఉంది అని ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే సదరు హీరోయిన్లలో కొందరు అరుదైన వ్యాధులు, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఒకప్పుడు బయటపెట్టేవాళ్లు కాదు గానీ ఈ మధ్య మాత్రం తమకు ఎదురైన సమస్య గురించి నలుగురికి చెప్పడంలో సదరు బ్యూటీస్ అస్సలు మొహమాట పడట్లేదు. తాజాగా ఓ నటి అలానే ఓ ఫొటో పోస్ట్ చేసి తన హెల్త్ ప్రాబ‍్లమ్‌ని రివీల్ చేసింది.

సమంతలా ఈ నటికి
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తనకు మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉందని గతేడాది బయటపెట్టిన సామ్.. ఇప్పుడు దానికి చికిత్స కోసమే విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీలానే బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా అరుదైన వ్యాధి బారిన పడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఈ నటి ఇన్‌స్టా స్టోరీలో ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు.

(ఇదీ చదవండి: ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో మళ్లీ స్టేజీపై చలాకీ చంటి!)

అదే కారణమా?
ఈషా గుప్తా పోస్ట్ చేసిన ఫొటోకి హైపర్బేరిక్ థెరపీ అని క్యాప్షన్ పెట్టింది. గతంలో ఇదే థెరపీ సమంత తీసుకుంది. మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ థెరపీ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల పాడైన కండరాలు బాగుపడతాయి. కండరాల వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని సామ్ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు అలాంటి ఆక్సిజన్ మాస్క్ తో ఈషా గుప్తా కనిపించడంతో ఈమెకీ మయోసైటిస్ వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. 

తెలుగులో రెండే
ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈషా గుప్తా.. గతంలో తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి సచిన్ జోషి హీరోగా నటించిన 'వీడెవడు' కాగా, రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' మూవీలో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాటలో ఈషా సందడి చేసింది. వీటి తర్వాత ఈమెకు టాలీవుడ్‌లో మరో ఛాన్స్ రాలేదనే చెప్పాలి. 

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!)

Advertisement
 
Advertisement
Advertisement