ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం | Actor Vishal Met Tamil Nadu Chief Minister Vijay | Sakshi
Sakshi News home page

Vishal - CM Vijay: సీఎం సార్.. మీరు ఏ మాత్రం మారలేదు

Jun 17 2026 3:43 PM | Updated on Jun 17 2026 3:54 PM

Actor Vishal Met Tamil Nadu Chief Minister Vijay

హీరో దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలువురు నటీనటులు ఈయనని కలుస్తూనే ఉన్నారు. ఖుష్బూ, సిమ్రాన్ తదితరులు తమ కుటుంబాలతో వెళ్లి మరీ విజయ్‌ని కలిశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా సీఎంని కలిశాడు. ఆయనని డార్లింగ్ అని పిలుస్తూ అందుకు గల కారణాన్ని కూడా చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)

'ప్రియమైన డార్లింగ్ సీఎం విజయ్‌కి. మిమ్మల్ని నేను ఎప్పటినుంచో డార్లింగ్ అనే పిలుస్తున్నాను. లయోలా కాలేజీ రోజుల నుంచి, మీతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఆ పిలుపు మారలేదు. ఎన్నో అటుపోట్లు, విమర్శలు తట్టుకుని మీరు సూపర్‌స్టార్‌గా ఎదగడం చూశా. ఇప్పుడు మీరు తమిళనాడు సీఎం కావడం ఆనందంగా ఉంది. మీ హోదా, పదవి మారి ఉండొచ్చు గానీ మీరు ఏ మాత్రం మారలేదు. కళైంజ్ఞర్ అయ్య నుంచి జయలలిత అమ్మ వరకు, స్టాలిన్ అంకుల్ నుంచి ఉదయ వరకు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలిచే అదృష్టం నాకు దక్కడం స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎప్పటికీ నేను మీ అభిమానినే'

'మిమ్మల్ని కలిసే సందర్భంలో బొకే, శాలువా ఇవ్వకుండా ఆ మొత్తాన్ని ఆర్థికంగా వెనకబడిన ముగ్గురు ఆడపిల్లల చదువు కోసం మీ పేరుతో సాయం చేస్తున్నాను. ఆ పిల్లలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారనే నమ్మకం నాకుంది. మీ పదవీకాలంలో తమిళనాడు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తమిళనాడుకు ఉత్తమ భవిష్యత్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని విశాల్ రాసుకొచ్చాడు. సాయం అందుకున్న పిల్లల పేర్లు కూడా తన ట్వీట్‌లో చేర్చాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement