క్యాసినో ఆడి గీతా మాధురి డబ్బులు పోగొట్టింది: నందు | Actor Nandu Says Geetha Madhuri Loss Money in Casino Game | Sakshi
Sakshi News home page

Actor Nandu: క్యాసినో వల్ల డబ్బులు పోగొట్టుకున్నాం.. ఆ రోజు పోలీసులు..

Dec 10 2023 3:08 PM | Updated on Dec 10 2023 3:46 PM

Actor Nandu Says Geetha Madhuri Loss Money in Casino Game - Sakshi

తను తెలివైన అమ్మాయే.. కానీ తను అక్కడ క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఈసారి వస్తుందేమో చూద్దామంటూ న్యూజిలాండ్‌, కాలిఫోర్నియాలో ఆడింది. ఇలా మూ

టాలీవుడ్‌ హీరో నందు ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నాడు. ఇటీవల మ్యాన్షన్‌ 24లో ఓ ముఖ్యపాత్రలో నటించిన ఇతడు తాజాగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న వధువు వెబ్‌సిరీస్‌లో హీరోగా నటించాడు. ఈ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకున్నాం..
'నేను, గీత ఓసారి లండన్‌కు వెళ్లాం. అక్కడ క్యాసినో గేమ్‌ చూసి గీతా మాధురి ఇష్టపడింది, అప్పటికప్పుడు నేర్చేసుకుంది. తను తెలివైన అమ్మాయే.. కానీ తను అక్కడ క్యాసినో ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఈసారి వస్తుందేమో చూద్దామంటూ న్యూజిలాండ్‌, కాలిఫోర్నియాలో ఆడింది. ఇలా మూడు, నాలుగుసార్లు ఓడిపోయింది.. డబ్బులు పోయాయి. ఇలా ఓ చోట సమయం తెలియకుండా ఆడుతూనే ఉంది. నాకు విసుగొచ్చి డబ్బులు విసిరేసి నేను వెళ్లిపోతానంటూ బయటకు వెళ్లిపోయా.. సారీ బుజ్జి అంటూ తను కూడా బయటకు వచ్చింది.

పోలీసులు చుట్టుముట్టారు
క్యాసినో బయట నేను తనను తిడుతుంటే.. అమ్మాయిని వేధిస్తున్నాననుకుని పోలీసులు వచ్చేశారు. మేమిద్దరం భార్యాభర్తలమే అని వారికి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఆ తర్వాత నుంచి క్యాసినో ఆడటం తగ్గించేసింది. ఒకవేళ ఆడినా.. రూ.5-10 వేలు మాత్రమే పెడుతోంది. మేమిద్దరం విడిపోతున్నామంటూ ఆ మధ్య పుకార్లు వచ్చాయి. మేము కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయకపోవడంతో ఈ రూమర్స్‌ మొదలయ్యాయి.

అందుకే విడాకుల రూమర్స్‌
బయట కూడా కలిసి కనిపించకపోవడంతో అదే నిజమనుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నందు అగ్లీ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు స్టార్‌ హీరోల సినిమాలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

చదవండి: గాఢంగా ప్రేమించా.. మోసం చేశాడు.. తప్పుడు వ్యక్తితో లవ్‌లో పడ్డా..

Advertisement
 
Advertisement
Advertisement