పాత బంగ్లా కోసం కోట్లు ధారపోసిన బాలీవుడ్‌ స్టార్‌! | Sakshi
Sakshi News home page

John Abraham: రూ.75 కోట్లు పెట్టి పాత బంగ్లా కొన్న 'పఠాన్‌' విలన్‌

Published Mon, Jan 1 2024 4:02 PM

Actor John Abraham Buys Bungalow in Mumbai For Rs 75 Crore - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో పేరుతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదించాడీ నటుడు. అటు హీరోగా, ఇటు విలన్‌గానూ సినిమాలు చేస్తున్న ఇతడు పఠాన్‌ సినిమాతో భారీ హిట్‌ అందుకున్నాడు. ఇందులో విలన్‌గా నటించిన జాన్‌ అబ్రహం తాజాగా ముంబైలో బంగ్లా కొన్నాడట!

7,722 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డిసెంబర్‌ 27న జాన్‌ అబ్రహం ఈ బంగ్లాను కొనుగోలు చేశాడు. బంగ్లా కోసం రూ.70.8 కోట్లు ఖర్చు చేయగా, స్టాంప్‌ డ్యూటీ కోసం అదనంగా రూ.4.25 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముంబైలోని ఖర్‌ లింకింగ్‌ రోడ్డులో ఈ భవంతి ఉంది.

అయితే ఇది పాత బంగ్లా కావడం గమనార్హం. బహుశా ఈ బాలీవుడ్‌ యాక్టర్‌ ఈ భవంతిని ఆధునీకరించి అద్దెకు ఇస్తాడేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి జాన్‌ అబ్రహం కమర్షియల్‌ ప్రయోజనాల కోసం ఆ బంగ్లా కొన్నాడా? లేదంటే దాన్ని కూల్చేసి కొత్త బిల్డింగ్‌ కడతాడా? అనేది తెలియాల్సి ఉంది.

చదవండి: హాయ్‌ నాన్న.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Advertisement
 
Advertisement
 
Advertisement