జాను, రామ్‌ల పెళ్లి ఫోటో వైరల్‌.. షాకవుతున్న నెటిజన్లు | 96 Movie Fame Gouri G Kishan And Adithya Bhaskar Marriage Photos Goes Viral | Sakshi
Sakshi News home page

జాను, రామ్‌ల పెళ్లి ఫోటో వైరల్‌.. షాకవుతున్న నెటిజన్లు

Mar 29 2024 3:53 PM | Updated on Mar 29 2024 4:44 PM

96 Movie Fame Gouri G Kishan And Adithya Bhaskar Marriage Photos Goes To Viral - Sakshi

కోలీవుడ్‌ హిట్‌ సినిమా '96'లో  విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఈ సినిమాలో వారిద్దరి చిన్ననాటి పాత్రలో నటించిన గౌరీ కిషన్, ఆదిత్య కూడా చాలా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా హీరో,హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు. చిన్నప్పటి త్రిషగా జాను పాత్రలో గౌరీ కిషన్ మెప్పిస్తే.. చిన్నప్పటి విజయ్ సేతుపతి 'రామ్‌' పాత్రలో ఆదిత్య కనిపించి ప్రేక్షకులను ఫిదా చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో  గౌరీ కిషన్ సినిమాలు  చేస్తోంది. టాలీవుడ్‌లో సుస్మిత కొణిదెల నిర్మించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఆధిత్య కూడా కోలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి కోలీవుడ్‌లో 'హాట్ స్పాట్' అనే సినిమాలో నటించారు. తమిళంలో ఆ సినిమా నేడు (మార్చి 29) విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గౌరీ కిషన్ కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఆ ఫోటోలు నెట్టింట భారీగా వైరల్‌ అయ్యాయి. వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కోలీవుడ్‌లో నెట్టింట వార్తలు కూడా వచ్చేశాయ్‌.  దీంతో నెటిజన్లు కూడా షాకయ్యారు.

కొందరైతే ఏకంగా వారిద్దరికి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఆ ఫోటోలతో పాటు వారు ఇచ్చిన క్యాప్షన్‌ చూసిన కొందరు ఇదంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం అని చెప్పడంతో కాస్త ఆ ప్రచారానికి బ్రేక్‌ ఇచ్చారు. సినిమా సెట్స్‌లో తీసిన ఫోటోలు అని తేలడంతో ఇలాంటి షాకులు ఇస్తే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన హాట్ స్పాట్ ట్రైలర్‌ కూడా కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. నేడు విడుదలైన ఈ సినిమా ఇంకెన్నీ వివాధాలను క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement