రెడ్డిపల్లి గ్రామంలో బోనాల ఉరేగింపు
అల్లాదుర్గం(మెదక్)/నర్సాపూర్: మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం కట్ట మైసమ్మకు బోనాలు తీశారు. మహిళలు బోనాల ఊరేగింపుతో శివసత్తుల నృత్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. బోనాలతో గ్రామంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. కాగా, ఈ నెల 9,10 తేదీల్లో నర్సాపూర్‌లో బోనాల పండుగ నిర్వహించనున్నారు. నర్సాపూర్‌లోని గ్రామదేవతలు ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, భూ లక్ష్మమ్మ, దుర్గామాతలకు ఆదివారం, సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు చేసి బండ్ల ఊరేగింపుతోపాటు బోనాలు చేసి దేవతలకు మొక్కులు సమర్పించనున్నారు.


