ఆదర్శ పాఠశాలలు! | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ పాఠశాలలు!

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

సీబీఎస్‌ఈ స్కూళ్లుగా

మోడల్‌స్కూళ్ల ధ్యేయమే సీబీఎస్‌ఈ

పాపన్నపేట(మెదక్‌): గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించాలన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం 2013లో మోడల్‌ స్కూళ్లు ఏర్పాటు చేసింది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు విద్యనందిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 820 విద్యార్థుల ప్రవేశానికి అవకాశముంది. 5 నుంచి 10 తరగతి వరకు 500, ఇంటర్మీడియెట్‌లో 320 విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు. ప్రతీ స్కూల్‌లో 100 విద్యార్థినులకు హాస్టల్‌ వసతి ఉంది. జిల్లాలో పెద్దశంకరంపేట స్కూల్‌లో ఇంకా హాస్టల్‌ ప్రారంభం కాలేదు. అయితే కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం, రోజు రోజుకు గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీలు పెరుగుతుండటంతో మోడల్‌ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయాలున్నాయి.

ప్రాథమిక పాఠశాలలతో బలోపేతం

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌కు డిమాండ్‌ ఉంటుంది. కాంపిటేటివ్‌ పరీక్షలు, సివిల్స్‌ లాంటి ప్రవేశ పరీక్షలకు సీబీఎస్‌ఈ సిలబస్‌ తోడ్పడుతుందని విద్యావేత్తలు భావిస్తారు. అందుకే మోడల్‌ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌తోపాటు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎఫిలియేషన్‌ పొందాల్సి ఉందని సమాచారం.

టేక్మాల్‌ మోడల్‌ స్కూల్‌

ప్రీ ప్రైమరీతోపాటు..ప్రాథమిక విద్య అందుబాటులోకి

ఆదర్శ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇక మీదట సీబీఎస్‌ఈ స్కూళ్లుగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అలాగే 2027–28 నుంచి ప్రీ ప్రైమరీతోపాటు ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. మెదక్‌ జిల్లాలో ప్రస్తుతం 7 మోడల్‌ స్కూళ్లు ఉండగా, 5,740 విద్యార్థులు నమోదయ్యే అవకాశముంది. కాగా ప్రస్తుతం 4,545 మంది విద్యార్థులు చదువుతున్నారు.

జిల్లాలో 7 మోడల్‌ స్కూళ్లు..మొత్తం 4,545విద్యార్థులు

సీబీఎస్‌ఈ సిలబస్‌ ధ్యేయంగా మోడల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ స్టేట్‌ సిలబస్‌లో కూడా విద్యార్థులు రాణిస్తున్నారు. ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. గతేడాది ఎస్సెస్సీలో 4 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాం. చేగుంట పాఠశాల విద్యార్థిని అస్మితారాజ్‌ 576 మార్కులతో జిల్లాలో రెండోస్థానంలో నిలిచింది. అన్ని పాఠశాలల్లోలాగే మోడల్‌ స్కూళ్లలో కొంత మేర అడ్మిషన్లు తగ్గాయి. – చంద్రకళ, నోడల్‌ ప్రిన్సిపల్‌, చేగుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement