పంద్రాగస్టు వేడుకకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకకు ఏర్పాట్లు

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించేందుకు మైదానాన్ని, వేదికను సిద్ధం చేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రజలకు కూర్చునేందుకు కనీస ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన స్టాళ్లు, శకటాల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. వేడుకల్లో ప్రసంగించేందుకు వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని జిల్లా ప్రణాళిక అధికారికి తెలిపారు. వేడుకలకు వచ్చే విద్యార్థులకు, ప్రజలకు కనీస వసతులు కల్పించాలన్నారు. జాతీయభావం పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌, సింగ్‌, డీఆర్‌ఓ అంబాదాస్‌ రాజేశ్వర్‌, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. అనంతరం రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ నెలవారి తనిఖీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జిల్లా అటవీ అధికారి జోజి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement