మెదక్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్‌హెచ్–44 జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌లను శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా ఎన్‌హెచ్–44 నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్ ఓపెనింగ్‌లు ఉన్న ప్రాంతాలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులోభాగంగా బంగారమ్మ టెంపుల్, కుచారం గ్రామం వద్ద ఉన్న బ్లాక్‌స్పాట్‌లను పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలు అధికంగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయని, ముఖ్యంగా వాహనాలు యూటర్న్ తీసుకునే ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎఐ రీజినల్ మేనేజర్ రంగారావుతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ చర్చించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐలు వెంకటరాజాగౌడ్, సందీప్‌రెడ్డి, మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు


