పరిశుభ్రత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత తప్పనిసరి

Jul 14 2026 6:52 AM | Updated on Jul 14 2026 6:52 AM

రామాయంపేట(మెదక్‌): చికెన్‌ దుకాణాల్లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో పట్టణంలోని చికెన్‌ దుకాణాల వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దుకాణాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్‌ కవర్లను వి నియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణంలో ఖచ్చితంగా అహార భద్రత ప్రమాణాలు పాటించాలని, వాటిలో పనిచేసే సిబ్బంది సైతం రక్షణ పరికరాలు వినియోగించాలన్నారు. ప్రతి దుకాణదారుడు మున్సిపల్‌ కార్యాలయం నుంచి విధిగా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ వనిత, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement