హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని ముత్తాయికోట సిద్దేశ్వరాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి గోవింద్ మహరాజ్ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పురాతన సిద్దేశ్వరాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
పెద్దశంకరంపేట(మెదక్): ఎస్‌ఐఆర్‌పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శశిధర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు వివరించి ఓటు హక్కును కాపాడుకునేలా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, సురేశ్‌గౌడ్, సుభాశ్, దత్తు, జంగం రాఘవులు, శంకరయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్‌జోన్: ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం కాదని, నియామకాలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లించి పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని కోరారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. పబ్లిక్ స్కూల్ పేరు మీద పాఠశాలలను మూసి వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోందని, అదే జరిగితే టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్, డీఈఓకు అందజేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్‌రెడ్డి, సంగయ్య, గోపాల్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్: కాంగ్రెస్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని నాచారం దేవాలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత నర్సారెడ్డికే దక్కుతుందన్నారు. ఒకే పార్టీలో ఉంటూ గ్రూపులుగా ఏర్పడవద్దని, కలిసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు ఆంజనేయులు గౌడ్ లక్ష్మీనరసింహగౌడ్, పురం రవీందర్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, శ్రీశైలం, యంజాలస్వామి, మాణిక్యరావు, గోపాల్, వేణు, నాగేష్, భాను, శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు.


