గురుకులాలకు ఎడ్యుకేషన్‌ కిట్లు | - | Sakshi
Sakshi News home page

గురుకులాలకు ఎడ్యుకేషన్‌ కిట్లు

Aug 10 2026 11:48 PM | Updated on Aug 10 2026 11:48 PM

● జిల్లాకు చేరిన నమూనా స్టడీ మెటీరియల్‌ సామగ్రి ● స్థానిక సంస్థల, ప్రభుత్వ పాఠశాలలకు షూస్‌, సాక్సులు

మంచిర్యాలఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులకు విద్యాసంవత్సరం కోసం ఉచితంగా ఎడ్యుకేషన్‌ కిట్లు పంపిణీ చేయనుంది. విద్యార్థుల చదువుకు అండగా నిలవడం, పేద విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించడం, చదువులో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రోత్సాహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసే కిట్లలో అవసరమైన స్టడీ మెటీరియల్స్‌ ఉన్నాయి. ఒకటి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ వరకు చదివే విద్యార్థులందరికీ పంపిణీ చేయనున్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ఎంజేపీ రెసిడెన్షియల్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లకు షూస్‌, సాక్స్‌లు జిల్లాకు సరఫరా అయ్యాయి. సర్కారు బడుల్లో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు అందిస్తుండగా షూస్‌, సాక్స్‌ల పంపిణీతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

జిల్లాకు చేరిన నమూనాలు..

సంక్షేమ గురుకులాల్లో అందించే ఎడ్యుకేషన్‌ కిట్ల నమూనాలు జిల్లాకు చేరాయి. ఇందులో బ్యాగు, టై, బెల్ట్‌, నోట్‌బుక్స్‌, రఫ్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, బాక్సులు, ష్యూస్‌, సాక్సు, ఇతర స్టేషనరీ సామగ్రి ఉన్నాయి. సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు మాత్రం నమూనా కిట్లు వచ్చాయి. పూర్తి స్థాయిలో విద్యార్థులకు కిట్లు ఎప్పుడు పంపిణీ చేస్తారో, ఏయే గురుకులాలకు అందిస్తారనేది తెలి యాల్సి ఉంది. వీటితోపాటు గురుకుల హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు బస చేయడానికి అవసరమైన వస్తువులతో కలిపి పరుపు, రగ్గు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్‌, తువ్వాలు, భోజన సామగ్రి(ప్లేట్‌, గ్లాస్‌, బౌల్‌ కప్పు, స్పూన్‌) అందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని గురుకులాల్లో రగ్గు, బెడ్‌షీట్లు అందించగా కేజీబీవీలకు భోజన సామగ్రి సరఫరా చేయగా విద్యార్థులకు పంపిణీ చేశారు.

జిల్లా విద్యాశాఖ పరిధిలోని 709 లోకల్‌బాడీ(స్థానిక సంస్థల), ప్రభుత్వ పాఠశాలలు, 18 కేజీబీవీ, 5 మోడల్‌స్కూళ్లు, 8 ఎంజేపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులకు అందించనున్న షూస్‌, సాక్స్‌లు జిల్లాకు చేరాయి. మిగతా సంక్షేమ గురుకులాలకు నేరుగా వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆయా ఎమార్సీలకు చేరాయి. ఒకటి రెండు రోజుల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయనున్నారు. షూస్‌, సాక్స్‌ల పంపిణీలో ఎంఈవో, పాఠశాల హెచ్‌ఎంలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు బూట్లు స్వీకరించిన వెంటనే పరిమాణం, సైజుల వారీగా తనిఖీ చేసి ప్రత్యేక స్టాక్‌ రిజిష్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి పాద కొలత, ట్రయల్‌ ఆధారంగా సరైన సైజు నిర్ణయించాలి. పంపిణీ అనంతరం విద్యార్థి, తరగతి ఉపాధ్యాయుని నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాల స్థాయిలో కొలతల వారి రిప్లేస్‌మెంట్‌ వివరాలను ఎంఈవోలకు పంపించాలని సూచించారు. మిగిలిన అదనపు, సరిపోని బూట్లను అసలు కార్టన్లలో ప్యాక్‌ చేసి పాఠశాల వివరాలతో లేబుల్‌ చేయాలి. స్టాక్‌ స్వీకరణ పంపిణీ, మిగులు, వివరాలను ప్రత్యేక స్టాక్‌ రిజిష్టర్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఎంఈవోలు రిప్లేస్‌మెంట్‌ వివరాలు సేకరించడం నుంచి మండల స్థాయిలో అవసరమైన రిజిష్టర్లు నిర్వహించడం, వివరాలు సమీకరించి డీఈవోకు పంపాలని సూచించారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంగళవారం పాఠశాల హెచ్‌ఎంలకు అందజేయనున్నారు.

షూస్‌, సాక్స్‌

గురుకులాలు/పాఠశాలలు సంఖ్య విద్యార్థులు

టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ 09 5,017

టీడబ్ల్యూ ఆశ్రమస్కూల్‌ 16 2,498

ఎంజేపీటీబీసీడబ్యుఆర్‌ఈఐఎస్‌ 08 4,010

మైనార్టీ వెల్పేర్‌ 04 1,114

టీఎస్‌ఆర్‌ఈఐ 01 585

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement