పాతమంచిర్యాల: దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ కార్మికులు, రైతులు, ప్రజల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి లాల్‌కుమార్ మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్‌కోడ్‌లు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, గౌరవ అధ్యక్షుడు ఖలిందర్ అలీఖాన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాస ప్రకాష్, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


