
మూగజీవాలను కాపాడిన హెడ్‌కానిస్టేబుల్
రామకృష్ణాపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని కార్మికవాడలకు భారీగా వరద నీరు చేరింది. ఆర్‌కే1 ఏరియా శివారులో పాలవాగుకు ఆనుకుని ఉన్న ఓ వ్యవసాయ భూమిలో పశువుల కోసం ఏర్పాటు చేసిన కొట్టం వరద నీటిలో ముని గిపోతుండగా ఆవుల ఆర్తనాదం విన్నవారు శనివారం పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ వెంటనే స్పందించి హెడ్ కానిస్టేబుల్ జంగును పంపించాడు. వరద ఉధృతిలో ప్రాణాలకు తెగించి ఒక కర్ర సహాయంతో ఈదుకుంటూ వెళ్లి మూగజీవా లను రక్షించాడు. హెడ్ కానిస్టేబుల్‌ను ఎస్సై, సీఐ శశిధర్‌రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.