
ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
కోటపల్లి: ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ అన్నారు. శనివారం సుపాక గ్రామంలో ప్రపంచ అదివాసీ దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివాసీల సభలో ఆయన మాట్లాడారు. అటవీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కుతూ అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి 2023నూతన అటవీ సంరక్షణ చట్టం తీసుకవవచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, నాయకులు నెర్పల్లి ఆశోక్, తలండి ముత్తయ్య, మడే వెంకటస్వామి, మల్లేశ్, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు సంకే రవి, కిసాన్‌మిత్ర జిల్లా కో అర్డినేటర్ సిడం రమేశ్, మత్య్సకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ తిరుపతి పాల్గొన్నారు.