
కాలనీలు జలమయం
ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
ఇన్‌ఫ్లో 2.16లక్షల క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో 3.13లక్షల క్యూసెక్కులు
భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు
వరదలతో కోతకు గురైన రోడ్లు,
అప్రోచ్ వంతెనలు
నీటమునిగిన పత్తి, వరి నారుమళ్లు
57 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
పోటెత్తిన వరద.. పరవళ్లు తొక్కుతున్న గోదావరి
ఓపెన్‌కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
తాండూర్: నర్సాపూర్ దారిలో వెళ్లకుండా ఏర్పాట్లు
నెన్నెల: అప్రోచ్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న ఎర్రవాగు
లక్సెట్టిపేట: పోతపల్లి దారిలో నీటి ప్రవాహం
నెన్నెలలో నీట మునిగిన పత్తి పంట
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో జలమయంగా మారాయి. హైటెక్ కాలనీలోని డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి చెరువును తలపించాయి. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌లోని రోడ్లు జలమయం కాగా, పలు దుకాణాల్లోకి నీరు చేరింది. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతోనే మురుగునీరు దుకాణాల్లోకి చేరిందని వాపోయారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస థియేటర్‌కు వెళ్లే దారిలో ఒక వైపు మాత్రమే డ్రెయినేజీ ఉండడం, వరద నీరు వెళ్లక రోడ్డుపై నిలిచి, ఇళ్లలోకి చేరి వస్తువులు పాడయ్యాయి. సూర్యనగర్, చున్నంబట్టివాడ, పాతమంచిర్యాలలోని శ్రీలక్ష్మీ కాలనీ, బృందావనం కాలనీల్లోని రోడ్లు, ఇళ్లను వరద నీరు చుట్టిముట్టింది. సూర్యనగర్‌లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చున్నంబట్టి వాడలోని రోడ్లు నీట మునిగడంతో వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పాతమంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంటు నుంచి వరద నీరు సమీప కాలనీల్లోకి చేరింది. రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించగా, కాజ్‌వేపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో సమీప కాలనీ ప్రజలు భయాందోళన చెందారు. డీసీపీ భాస్కర్ రాళ్లవాగు, పట్టణంలోని లొతట్టు ప్రాంతాలను సందర్శించారు. రైల్వే అండర్‌బ్రిడ్జిలు, సీతారామ కాలనీ, బృందావనం కాలనీ, సూర్యనగర్ కాలనీల్లోని రోడ్లు వరదలో మునిగాయి.
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8.30గంటల వరకు 53 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30గంటలకు భారీ వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు జనజీవనం స్తంభించింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించి అతలాకుతలమైంది. చెరువులు, కాలువలకు గండ్లు పడడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. కన్నెపల్లి, భీమిని, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, కాసిపేట, నెన్నెల, కోటపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కోటపల్లి మండలం జనగామ గ్రామంలో చెన్నూర్ కవిత ఇల్లు కూలింది. పత్తి, వరి పొలాల్లో వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరడంతో 11గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎడతెరిపి లేని వర్షానికి శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాల్లోని ఓపెన్‌కాస్టుల్లో భారీగా వరద నీరు చేరి 20వేల మెట్రిక్ టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి రూ.కోట్ల నష్టం వాటిల్లింది.
స్తంభించిన రాకపోకలు
కన్నెపల్లి మండలంలో అత్యధికంగా 140.8 మిల్లీమీటర్లు, భీమిని మండలంలో 118.5మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కన్నెపల్లి, జజ్జరవెల్లి ఎర్రవాగు, చిన్నతిమ్మాపూర్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణ, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. ఒర్రెలు, వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగి పొర్లడంతో 57 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. కాసిపేట, భీమారం, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో 24 గ్రామాలకు, కోటపల్లి మండలం ఎదులబంధం, తూతుంగ వాగు, నక్కలపల్లి ఒర్రె ఉప్పొంగడంతో 14గ్రామాలకు, భీమిని, కన్నెపల్లి మండలంలో ఎర్రవాగు, జన్కాపూర్ చెరువు, ఒర్రెలు పొంగి ప్రవహించడంతో 19గ్రామాలకు, నెన్నెల మండలం ఎర్రవాగు ఉప్పొంగడంతో దమ్మిరెడ్డిపేట, ఖర్జీ జంగల్‌పేట, కోనంపేట తదితర ఏడు గ్రామాలకు, చెన్నూర్ మండలంలో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి పరవళ్లు
మహారాష్ట్రతోపాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది, గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎ త్తి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. నీల్వాయి ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కులు మత్తడి ద్వారా దిగువకు వెళ్తోంది.
‘ఎల్లంపల్లి’ 20 గేట్ల ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట వద్దనున్న ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టు గేట్లు శనివారం ఎత్తారు. దీంతో దిగువన గోదావరి నదిలోకి నీరు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను శనివారం 18.750 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో 1.62లక్షల క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 55వేల క్యూసెక్కులు మొత్తంగా 2.16లక్షల క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లిలోకి చేరుతోంది. దీంతో సాయంత్రం 6గంటల నుంచి అధికారులు మొదట 10గేట్లు ఎత్తారు. రాత్రి 7గంటల ప్రాంతంలో 20గేట్లకు పెంచా రు. గేట్లు ఎత్తడం ద్వారా 3.13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్‌హౌజ్‌కు 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. కాగా, గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 15టీఎంసీల నీటిమట్టంతో ఉండగా గేట్లు ఎత్తలేదు.
నెన్నెలలో ఇంట్లోకి చేరిన నీటిని బయటకు తోడేస్తున్న రైతు
జిల్లాకు వర్షసూచన
జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 626.2 మిల్లీమీటర్లు కాగా 536.5 మిల్లీమీటర్లు కురిసింది. సగటున ఇంకా 14 శాతం లోటు నెలకొంది. భీమిని మండలంలో 34శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఇంకా 13 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాకు మరో నాలుగు రో జులపాటు ఆరెంజ్, ఎల్లో అలార్ట్ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది.
ముల్కల్లలో జాతీయ రహదారిపై విరిగిపడిన చెట్టు
తాండూర్: అచ్చలాపూర్‌లో ఇంట్లోకి చేరిన నీరు
ప్రాజెక్టుల్లో నీటిమట్టం వివరాలుప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుత నీటిమట్టం ఇన్‌ఫ్లో (మీటర్లలో) (మీటర్లలో) (క్యూసెక్కుల్లో) ర్యాలీవాగు 151.50 145.200 200
గొల్లవాగు 155.50 150.100 140.772
నీల్వాయి 124 124 900
జన్నారం: శ్రీలంక కాలనీలో ఇంటిలోకి వరదనీరు
వర్షపాతం(మిల్లీమీటర్లలో) వివరాలు
శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు
శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు
జన్నారం దండేపల్లి లక్సెట్టిపేట హాజీపూర్ కాసిపేట తాండూర్ భీమిని కన్నెపల్లి వేమనపల్లి నెన్నెల బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల నస్పూర్ జైపూర్ భీమారం చెన్నూర్ కోటపల్లి
54.2 32.8 56.1 44.4 92.1 15.8 9.7 31.5 84.6 74.9 40.5 52.1 38.2 38.4 61.1 54.3 74.8 98.1
32.5 68.3 49.5 67.5 42.8 65.0 118.5 140.5 10.0 102.3 62.3 30.3 68.3 58.6 24.3 23.3 17.8 22.5

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం

కాలనీలు జలమయం