
‘తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోం’
మంచిర్యాలటౌన్: బీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14న హాజీపూర్ మండలంలోని రాపల్లిలో బీఆర్‌ఎస్ నాయకు డు ఆనె మల్లేశ్‌కు సంబందించిన ఒక పెళ్లి బరా త్‌లో కాంగ్రెస్ నాయకులు కావాలని గొడవచేసి, దాడికి పాల్పడ్డారని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ నెల 15న ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. దెబ్బలు తిన్నవారిపైనే కేసు న మోదు చేయడం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ను పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీపీకి ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, హాజీపూర్ మండల అధ్యక్షు డు మొగిలి శ్రీను, మంచిర్యాల పట్టణ అధ్యక్షు డు గాదె సత్యం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, అత్తి సరోజ పాల్గొన్నారు.