
అధైర్య పడకండి.. అండగా ఉంటా
జన్నారం: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అధైర్య పడవద్దని, అండగా ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పొనకల్ బుడుగ జంగాల కాలనీ, రాంపూర్ గ్రామ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటిగూడకు వెళ్లే దారిపై వంతెన నిర్మిస్తామన్నారు. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నందువల్ల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. గోదావ రి, వాగులు, ఇతర ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్, నాయకులు ఇసాక్, రియాజొద్దీన్, మహేశ్, మాణిక్యం, కరుణాకర్, నందునాయక్, సుధీర్‌కుమార్, తదితరులు ఉన్నారు.