
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీఠంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న మంచిర్యాల జట్టును ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకూబ్ ఆదివారం ప్రకటించారు. బాలుర విభాగంలో సాయిదీక్షత్ (కార్మెల్ హై స్కూల్, మంచిర్యాల), వినయ్, అభిరామ్(జెడ్పీహెచ్‌ఎస్, రెబ్బనపల్లి), సాయినాథ్, కౌశిక్ (టీజీడబ్ల్యూఆర్‌ఎస్ కోటపల్లి), ధనుష్ (జెడ్పీహెచ్‌ఎస్, తాళ్లపేట్), హర్షిత్ (జెడ్పీహెచ్‌ఎస్, జైపూర్), సాయి (టీజీడబ్ల్యూఆర్‌ఎస్ గుడిపేట్) జట్టు ఎంపికై ంది. బాలికల విభా గంలో ఎం.రుచిత, అక్షిత, జె.రాణి (జెడ్పీహెచ్‌ఎస్, రెబ్బనపల్లి), నక్షత్ర (జెడ్పీహెచ్‌ఎస్, అస్నాద్), హరిప్రియ, శాలిని (టీజీడబ్ల్యూఆర్‌ఎస్, లక్సెట్టిపేట్) ఎంపికయ్యారు. జట్టు కు కోచ్‌లుగా వ్యాయామ ఉపాధ్యాయులుగా జుల శ్రీనివాస్, మనోహర్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై న క్రీడాకారులను డీఈవో యాదయ్యతో పాటు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు రేణి రాజయ్య, రోజి వరకుమారి, సిరంగి గోపాల్, సురేష్, సత్యనారాయణ అభినందించారు.