
ఎల్లంపల్లి గేట్ల మూసివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం 18.350 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కింద 15 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అవుట్‌ఫ్లో కింద 13 వేల క్యూసెక్కుల నీటిని బయటకు తరలిస్తున్నా రు. ఇందులో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 295, ఎన్టీపీసీకి 121, నంది పంప్‌హౌజ్‌కు 12,600ల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు తెరిచి ఉన్న 10 గేట్లను రాత్రి మూసివేసి నీటిని నిల్వ చేస్తున్నారు.