
నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలి
● కలెక్టర్ కుమార్‌దీపక్
మంచిర్యాలఅర్బన్: నులి పురుగుల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో లక్షా 58వేల 480 మంది పిల్లలకు మాత్రలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, ఉప వైద్యాధికారి అనిత, ప్రోగ్రాం అధికారి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతుల అవసరాల మే రకు జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని, పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయధికారి భుక్యా ఛత్రునాయక్, ఉద్యానవన శాఖ అధికారి అనితతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ యూరియా కృత్రిమ కొరత సృష్టించడం, పక్కదారి పట్టించడం వంటి అంశాలపై ప్రత్యే క నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 31లోగా వరి సాగు పూర్తి చేయాలని, సాగు ప్రారంభం కాని పక్షంలో ఇతర పంటలు సాగు చేసేలా రైతులను అవగాహన కల్పించాలన్నారు. పత్తిలో అంతర పంటగా మునగ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.