
‘ఐఎంఏ’లో కుల రాజకీయం!
● దళిత వైద్యుడిపై మరో వైద్యుడి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మంచిర్యాల చాప్టర్‌లో కుల రాజకీయం వివాదాస్పదమైంది. గత సెప్టెంబర్‌లో జిల్లా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా పోటీలో ఉన్న ఓ సీనియర్ వైద్యుడు.. మరో వైద్యుడిపై తన సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ చేసిన అ భ్యంతకర వ్యాఖ్యలపై విచారణ మొదలైంది. జిల్లా ఎన్నికల్లో గెలిచేందుకు పోటీలో ఉన్న ఓ సీని యర్ వైద్యుడు.. పోటీదారుడైన ఓ దళిత సీనియర్ వైద్యుడిపై తీవ్ర ఆరోపణ చేశారు. ఆ సమయంలోనే పో లీసులకు ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్‌లో ఫిర్యా దు చేసినా ఇప్పటికీ కేసు నమోదు కాలే దు. అంతేగాక జిల్లా ఐఎంఏలో కీలకంగా ఉన్న ఆ వైద్యుడు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా అనేక ర కాలుగా పలుకుబడి వాడి ఒత్తిడి తెస్తున్నట్లుగా తె లుస్తోంది. దీనిపై సదరు వైద్యుడు, సంధి చేసుకుని కేసు కాకుండా ఉండేందుకు మొదట క్షమాపణ చె ప్పి కూడా, మళ్లీ తన మాటలకు కట్టుబడి ఉన్నానంటూ ప్రకటించాడు. దీంతో తాజాగా మళ్లీ వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో కుల ప్రస్తావన తెచ్చి తనను మానసికంగా ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో గెలిచారని రారష్ట్‌ర ఐఎంఏ ప్రతినిధులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో రెండు రోజుల క్రితం నిజ నిర్ధారణ కమిటీ జిల్లా అసోసియేషన్ సభ్యుల నుంచి ఈ ఘటనపై వివరాలు సేకరించింది. త్వరలోనే రాష్ట్ర కమిటీకి పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య అసోసియేషన్ ఎన్నికల్లో కుల ప్రస్తావన తెచ్చినట్లు రుజువైతే గెలిచిన ఆ ప్రతినిధిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కార్మిక సమస్యలపై
ఆందోళనలు
శ్రీరాంపూర్: సింగరేణిలో కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టనున్నట్లు టీబీజీకేఎస్ నాయకులు తెలిపారు. సోమవారం ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో నూతన గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త గనులు లేకపోతే సంస్థ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. సమస్యలపై మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్టుమెంట్ల వద్ద అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని, 25న జీఎం కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు కార్మికవర్గం రావాలని పిలుపునిచ్చారు. వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు పొగాకు రమేష్, పానుగంటి సత్తయ్య, అన్వేష్‌రెడ్డి, నాయకులు ఉత్తేజ్‌రెడ్డి, సాధుల భాస్కర్, రమేష్, లాల, జయపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.