ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపాదికన చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపాదికన చేపట్టాలి

Aug 5 2026 2:05 AM | Updated on Aug 5 2026 2:05 AM

భూత్పూర్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పను లు యుద్ధ ప్రాతిపాదిక పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్‌ అన్నా రు. మంగళవారం మండలంలోని కర్వెన ప్రాజెక్టు ను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎగ్గని నర్సింహులుతో కలిసి దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌, అడ్డాకుల మండలాలకు చెందిన బీజేపీ నాయకులు పరిశీలించారు. కర్వెన రిజర్వాయర్‌ వరకు మెయిన్‌ ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులను డిసెంబర్‌ 2026 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రస్తుతం ఏ దశలో పనులు చేపడుతున్నరో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని శాంతికుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నట్లు కనిపించడం లేదని, గడువులు ప్రకటించడం కాదని, పనులు పూర్తి చేయాలని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునారావాసం, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పెండింగ్‌ పనులు ఫ్రభుత్వమే తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పడాకుల బాల్‌రాజు, అంజయ్య, నంబి రాజు, రవీందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నిరంజన్‌, నాగరాజు, సుధీర్‌కుమార్‌, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement