మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడంలో అన్ని శాఖల సమష్టి కృషి దాగి ఉందని అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఆపరేషన్ ముస్కాన్‌లో కీలక పాత్ర పోషించి ఉత్తమ విధులు నిర్వహించిన అన్ని రకాల శాఖ అధికారులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. భవిష్యత్‌లో కూడా చిన్నారుల సంక్షేమం కోసం ఇదే సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో బాల కార్మికులు, భిక్షాటన, బాల్య వివాహాలు, విద్యకు దూరమైన చిన్నారులను గుర్తించి రక్షించడంలో ప్రతి శాఖ బాధ్యతతో పని చేసిందన్నారు. కార్యక్రమంలో ఉమెన్ పీఎస్ సీఐ కృష్ణ, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, డీసీపీఓ నర్మద, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శశికాంత్, కార్మిక శాఖ అధికారి బాసిత్, ఎస్‌ఐ లెనిన్ పాల్గొన్నారు.


