లారీ బోల్తా: డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా: డ్రైవర్‌ మృతి

Aug 4 2026 1:11 AM | Updated on Aug 4 2026 1:11 AM

చారకొండ: పేపర్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌ చెందినట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. కర్ణాటక నుంచి కలకత్తాకు పేపర్‌ లోడ్‌తో లారీ వెళ్తోంది. మండలంలోని జడర్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై సారంబండ తండా సమీపాన మూలమలుపున అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన రేలీంగ్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ కిశోర్‌బాబు(40) కుడిచేతి మణికట్టు వద్ద విరిగి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకన్నాడు. స్థానికులు అంబులెన్స్‌లో కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement