కడుపునొప్పి భరించలేక యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక యువకుడి బలవన్మరణం

Aug 4 2026 1:11 AM | Updated on Aug 4 2026 1:11 AM

మరికల్‌: కడుపునొప్పి భరించలేక చెట్టుకు ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడని ఘటన సోమవారం అప్పంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పంపల్లికి చెందిన కె.రవికుమార్‌(22) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించినా తగ్గకపోవడంతో తన పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల రైతులు గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌చార్జీ ఎస్‌ఐ గాయత్రి తెలిపారు.

ఉరేసుకుని తాపీమేసీ్త్ర బలవన్మరణం

వేధింపులే కారణమా..?

చారకొండ: మండల కేంద్రంలో ఓ ఇంట్లో తాపీమేసీ్త్ర ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్‌ కరిముల్లా(52) కొన్నేళ్లుగా మండల కేంద్రంలో తాపీమేసీ్త్రగా పనిచేసుకుంటూ అద్దెకు నివాసముంటున్నాడు. ఇటీవల నూతనంగా ఓ ఇంట్లో పనులు చేస్తున్నాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో 3వ అంతస్తులోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌ కొండికి తాడుతో ఉరేసుకున్నాడు. కూలీగా పనిచేస్తున్న మరోవ్యక్తి అక్కకెళ్లి చూడగా విగతజీవిగా ఉండడంతో సమీప స్థానికులకు తెలుపగా పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలను తెలుసుకొని భార్య దిబిజాన్‌, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కల్వకుర్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఖరిముల్లా బాబాయి కరీంబాషాను చనిపోవడానికి గల కారణమైన వ్యక్తుల గురించి కాగితంలో రాసినట్లు తెలిపాడు. దీంతో మండలకేంద్రంలో ముగ్గురు వ్యక్తులు తమ తండ్రికి కారణమయ్యారని, వారు డబ్బులిచ్చి మేసీ్త్ర పనిచేయించుకొని ఇబ్బందులకు గురి చేశారని వేధించడంతో మనస్తాపంతో మృతిచెందాడని, కారకులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు చారకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.

పరామర్శించేందుకు

వెళ్తూ మృత్యుఒడికి..

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రాజాపూర్‌: వరుసకు కొడుకై న వ్యక్తి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం బాలానగర్‌ మండలం కేతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బాలానగర్‌ ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం చెల్కచిల్కమర్ర గ్రామానికి చెందిన మనీల(36) వరుసకు కొడుకై న శ్రీకాంత్‌ ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్నా విషయం తెలుసుకొని మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి బంధువులు రమేశ్‌, రాకేశ్‌లతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వీరి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో మనీల తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మృతురాలి భర్త చెనిగారి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మొసలిని బంధించిన అధికారులు

వనపర్తి రూరల్‌: మండలంలోని పెద్దగూడెం శివారు రొయ్యల రమేష్‌ వ్యవసాయ పొలంలోని బావిలో ఉన్న మొసలిని సోమవారం ఎస్‌ఐ హృశికేష్‌ ఆధ్వర్యంలో స్నేక్‌ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌, వారి బృందం, ఫారెస్టు అధికారులు బంధించి బయటకు తెచ్చారు. అటవీ అధికారుల సమక్షంలో సొసైటీ సభ్యులు మొసలిని సురక్షితంగా జూరాల ప్రాజెక్టులో వదిలినట్లు తెలిపారు.

ఇసుక టిప్పర్‌ పట్టివేత

మానవపాడు: మండలంలోని రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద సోమవారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ స్వాతి తెలిపిన వివరాలు.. బ్లూకోర్టు సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తుండగా.. కర్నూలు వైపు నుంచి వస్తున్న టిప్పర్‌ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమనగల్లుకు చెందిన టిప్పర్‌లో ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. టిప్పర్‌ యాజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement