తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ

Aug 3 2026 12:43 AM | Updated on Aug 3 2026 12:43 AM

ఏడున్నర తులాల బంగారం, రూ.3.5లక్షల నగదు అపహరణ

గట్టు: గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంటికి కన్నం వేసి ఏడున్నర తులాల బంగారం, రూ.3.5 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఆరగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఆరగిద్దకు చెందిన మునేశ్వరి ఉదయం ఇంటికి తాళం వేసి పిల్లలను పక్కింటిలో వదిలి, తాను వేరే గ్రామానికి పని నిమిత్తం వెళ్లింది. ఇంటి వద్ద ఎవరూ లేరని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో ఇంటి తాళం విరగొట్టి ఏడున్నర తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు చోరీ చేశారు. ఇంటి తాళం తీసిన విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు మునేశ్వరికి సమాచారం అందించారు. ఇంటికి వెళ్లి పరిశీలించగా.. బీరువా తెరచి, వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి, గట్టు పోలీసులకు సమాచారం అందించా రు. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను, ఎస్‌ఐ శేఖర్‌గౌడు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మునేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement