ఎమ్మెల్యే యెన్నంకు కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే యెన్నంకు కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డు

Aug 3 2026 12:43 AM | Updated on Aug 3 2026 12:43 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డు ప్రదానం చేశారు. సమాజ సేవ, విద్యారంగంలో ఆయన చూపిన అంకితభావానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించడం విశేషం. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2 వేల పాఠశాలల్లో 2లక్షల మందికిపైగా విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి గుర్తింపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు, ఆధునిక సాంకేతిక వనరుల వినియోగం, విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తి పెంపొందించడం, ఉపాధ్యాయులకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారు. ప్రత్యేకంగా పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న శతశాతం వంటి పథకాలు డిజిటల్‌ స్టడీ మెటీరియల్స్‌, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. ఎమ్మెల్యేకు అంతర్జాతీయ గౌరవం లభించడంపై మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలు, విద్యావంతులు, మేథావులు, సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement