కలుపు నివారణతో దిగుబడి | - | Sakshi
Sakshi News home page

కలుపు నివారణతో దిగుబడి

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

అలంపూర్‌: వానకాలం పంట సీజన్‌లోని వివిధ పంటల సాగులో కలుపు సమస్య ప్రధానంగా ఉంటుంది. కలుపు వలన 30 నుంచి 70 శాతం పంట నష్టం జరిగే అవకాశం ఉంది. వివిధ పంటల్లో వచ్చే కలుపును నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఊద నివారణకు..

వరిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి విత్తిన 2 నుంచి 3 రోజుల్లో ప్రిటిలాక్లోర్‌ 50 శాతం ద్రావకం 400 మి.లీ. లేదా విత్తిన 14, 15 రోజుల సమయంలో సైహాల్‌పాప్‌ బ్యూటైట్‌ 10 శాతం ద్రావకం 400 మి.లీ 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి. లేదా ఊద వెడల్పా కు కలుపు సమపాళ్లలో ఉంటే నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు మి.లీ. బిస్‌ పైరిబాక్‌ సోడియం(10)శాతం 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.

మాగాణి వరిలో..

మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే నాటిన 3 లేదా 5 రోజుల్లో పొలంలో పలుచగా నీరుంచి ఎకరాకు 1–1.5 లీ. బుటాక్లోర్‌ (50 శాతం) లేదా 400 మి.లీ. చొప్పున అనిలోఫాస్‌ (30 శాతం) ప్రిటిలోక్లోర్‌ (50 శాతం)గాని 20 కిలో పొడి ఇసుకలో కలిపి చల్లాలి. గడ్డి, తుంగ వెడల్పాటి ఆకుజాతి మొక్కలు సమపాళ్లలో ఉంటే ఎకరాకు వరి నాటిన 3 లేక 5 రోజుల్లో 4కి బుటాక్లోర్‌ 5 శాతం గుళికలు+4కి2.4–డీ ఇథైల్‌ ఎస్టర్‌ 4 శాతం గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. నాటిన 20 నుంచి 30 రోజుల్లో వెడల్పాటి కలుపు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రాములు 2.4– డీ సోడియం సాల్ట్‌ (80 శాతం) లేదా ఇథాక్సి సల్ఫురాన్‌ 15 శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

మొక్కజొన్న: మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 2– 3 రోజుల్లో ఎకరాకు 1–1.5 కిలోల అట్రాజీన్‌ పిచికారీ చేయాలి. తర్వాత 30– 35 రోజుల్లో గొర్రు గంటుకతో అంతర్‌కృషి చేయాలి.

జొన్న : జొన్న విత్తిన వెంటనే లేదా 2– 3 రోజుల్లో 600 నుంచి 800 గ్రాముల అట్రాజిన్‌ను విత్తిన 20 రోజుల తర్వాత అయితే 400 గ్రాముల 2,4– డీ సోడియం సాల్ట్‌ 80 శాతం పొడిని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

పత్తి : పత్తి విత్తిన వెంటనే లేదా 1 లేదా 2 రోజుల్లో ఎకరాకు 1– 1.3 లీ. పెండిమిథాలిన్‌ 45 శాతం లేదా 1.5–2 లీ. అలాక్లోర్‌ 50 శాతం వాడాలి. ఖరీఫ్‌లో వర్షాలు ఎక్కువ ఉండి అంతర్‌ కృషి కుదరనప్పుడు 400 మి.లీ. కై ్వజలాపాప్‌ ఇథైల్‌ +250 మి.లీ. పైరితయోటాక్‌ 10 శాతాన్ని పత్తిమీద పడకుండా సాళ్ల మధ్య కలుపు మీద పడేలా చల్లాలి.

చెరకు : ముచ్చెలు నాటిన వెంటనే లేదా 2 మూడు రోజుల్లో ఎకరాకు 2 కిలోల అట్రడాజిన్‌ పిచికారీ చేసి కలుపు నివారించవచ్చు. వెడల్పాటి ఆకులు ఎక్కువగా ఉంటే తోటనాటిన తర్వాత 30, 60 రోజుల్లో ఎకరాకు అరకిలో 2,4– డీ సోడియం సాల్ట్‌ చల్లాలి లేదా దీనికి అరకిలో మెట్రబుజిన 70 శాతం కలిపి పైరుపై పడకుండా సాళ్ల మధ్య పిచికారీ చేయాలి.

మిరప : నాటడానికి ఒకటి రెండు రోజుల ముందు ఎకరాకు 1.3– 1.6 లీ. పెండిమిథాలిన్‌ లేదా 200 మి.లీ. ఆక్సిప్లోరోఫిస్‌ (23.5 శాతం) పిచికారీ చేయాలి. నాటిన 25 నుంచి 30 రోజుల తర్వాత సాళ్ల మధ్య గొర్రు లేదా గుంటక తోలాలి. గడ్డిజాతి కలుపు నిర్మూలనకు 400 మి.లీ కై ్వజాలాపాప్‌ ఇథైల్‌ పిచికారీ చేయాలి.

పండ్ల తోటల్లో : పండ్ల తోటల్లో వచ్చే వివిధ రకాల కలుపు నిర్మూలనకు లీటర్‌ నీటికి 10 మి.లీ గ్‌లైపాసేట్‌ 10 శాతం +10 గ్రాముల అమోనియం సల్ఫేట్‌ లేదా యురియా కలుపు పూత రాకముందే నేలలో తేమ ఉన్నప్పుడు నాజిల్‌కు డోమ్‌ పెట్టి పండ్ల మొక్కలపై పడకుండా కలుపుపై పిచికారీ చేయాలి. అవసరమైతే 1, 2 నెలల తర్వాత మరోసారి చల్లాలి.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement