వ్యక్తి మృతి: కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతి: కేసు నమోదు

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

రాజాపూర్‌: బతుకుదెరువు కోసం వచ్చి ఫాంహౌస్‌లో పనిచేస్తూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం బాలానగర్‌ మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన మీర్జా సర్దార్‌బేగ్‌ (50) భార్య ఫర్హత్‌ ఉన్నిసాబేగం ముగ్గు రు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు చెందిన హుస్సేన్‌ ఫాంహౌస్‌లో మేకలు, గేదెలు మేపు కుంటూ జీవనం సాగించేవారు. శనివారం రాత్రి షెడ్‌లో మేకలను చూసేందుకు వెళ్లిన మీ ర్జాసర్దార్‌బేగ్‌ కళ్లు తిరిగి సిమెంట్‌ బెడ్‌పై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపారు.

వ్యవసాయ బావిలో మొసలి

వనపర్తి రూరల్‌: మండలంలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన రొయ్యల రమేష్‌ వ్యవసాయ పొలంలో ఉన్న బావి కన్నంలో మొసలి ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటికి వస్తుందని రైతు తెలిపారు. ఆదివారం ఉద యం తమ కుటుంబ సభ్యులు బావి సమీపంలోకి వెళ్లగా.. మొసలి కనబడంతో భయంతో పరుగులు తీశారని రైతు పేర్కొన్నాడు. పోలీసులకు ఫోనులో సమాచారం ఇచ్చామని తెలిపారు. అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని తీసుకెళ్లాలని ఆయన కోరారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

బల్మూర్‌: కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండలంలో జరిగింది. ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని మహదేవ్‌పూర్‌ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి భార్య విజయమ్మతో కలిసి జూలై 31న హైదరాబాద్‌లో ఉన్న తమ కుమార్తె, అల్లుడి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపుల తాళం పగులగొట్టి బీరువాలోని సుమారు 2 తులాల బంగారు నెక్లెస్‌, తులం బంగారు కెంపుదండ, 2 బంగారు ఉంగరాలు, 4 బంగారు పుస్తలగుండ్లు, 40 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసి క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మార్షల్‌ ఆర్ట్స్‌లో

బంగారు పతకం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఇంటర్నేషనల్‌ కరాటే మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీహనుమాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విద్యార్థి మహ్మద్‌ ఫర్హాన్‌ అహ్మద్‌ బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో ఆదివారం జరిగిన పోటీల్లో సత్తా చాటి గోల్డ్‌ మెడల్‌ సాధించినట్లు కరాటే మాస్టర్‌ కె.వెంకటేశ్‌ తెలిపారు. అండర్‌–14 విభాగం కుమితేలో పతకం సాధించినట్లు పేర్కొన్నారు. పతకం సాధించిన విద్యార్థిని పలువురు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement