మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ క్లస్టర్ స్థాయి పురుషుల వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. చాంపియన్‌గా మరికల్ జట్టు, రన్నరప్‌గా గాదిర్యాల జట్టు, మూడోస్థానంలో గొల్లపల్లి జట్టు, నాలుగో స్థానంలో నవాబ్‌పేట జట్టు నిలిచాయి. ఆయా జట్లకు ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య తదితరులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. విన్నర్, రన్నరప్ జట్లు ఈనెల 16న హైదరాబాద్‌లో జరిగే డివిజన్ (రాష్ట్రస్థాయి) టోర్నమెంట్‌లో పాల్గొంటాయని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రమేష్‌బాబు, నాగరాజు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
మయూర
విహారం..


