జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): యాదవులు రాజకీయంగా, సామాజికంగా ఎదుగాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు యాదవ్ కోరారు. జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్ అధ్యక్షతన ఆదివారం స్థానిక ఏనుగొండలోని రామదూత టౌన్‌షిప్‌లో సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉన్నటువంటి యాదవ బంధువులు హైదరాబాద్‌లో శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హాస్టల్ భవనానికి ఆర్థిక సహకారం అందించి సహకరించాలని కోరారు. అనంతరం యాదవ హాస్టల్ భవనానికి సాయిబాబా యాదవ్ రూ.లక్ష నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మాయాదవ్ రూ. 25వేలు, విష్ణువర్ధన్ యాదవ్ రూ.25 వేలు, వెంకట్రాములు రూ.11 వేలు, మద్దిలేటి యాదవ్ రూ.10 వేలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న బైకని బాలు యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజన్న యాదవ్, జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోదా తిరుపతయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


