మహమ్మదాబాద్: మిషన్ భగీరథ నీటిసరఫరాలో లోపాలను సరిదిద్దాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం నంచర్లలో మిషన్ భగీరథ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటిశుద్ధి, పంపింగ్ వ్యవస్థ, నిల్వ ట్యాంకులు, పైప్‌లైన్ల పనితీరును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైప్‌లైన్ లీకేజీలు, సాంకేతికలోపాలు, మరమ్మతులపై ఆరా తీశారు. నీటిసరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సమస్యలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పరిశీలించారు. అలాగే నంచర్ల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, హాస్టల్ సౌకర్యాలు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, విద్యాబోధనపై ఆరాతీశారు. పరిసరాలను పరిశీలించిన విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వెంట మిషన్ భగీరథ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ అనిల్, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ రమా, సిబ్బంది పాల్గొన్నారు.


