మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ (థామస్‌రెడ్డి) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మణ్‌గౌడ్ కోరారు.గురువారం మహబూబ్‌నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్లు కవిత, జయరాంలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సంస్థ అభివృద్ధికి అన్నివిధాల కట్టుబడి ఉన్నామన్నారు. కొత్తగా ఎన్నికై న తమ యూనియన్ డిపో కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బీకే రెడ్డి, ముజీబ్, టీఆర్‌సీ శేఖర్‌రెడ్డి, తెల్కపల్లి రాములు, హబీబ్ హసన్, చంద్రమోహన్, నిజామాబాద్ శ్రీనివాస్, ప్రేమలత, అమరేశ్వరి, రాగిణి, శిరీష, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు.


