మహబూబ్‌నగర్ క్రైం: యువత దేశ భవిష్యత్‌కు బలమైన శక్తిగా మారాలి తప్పామాదకద్రవ్యాలు లాంటి వాటికి బానిసలుగా కావ్వొద్దని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం మేరా యువ భారత్– నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత డ్రగ్స్‌కు బారినపడకుండా, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా యువతకు 8 రకాల పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తోటానాయక్, అనిల్‌కుమార్, రాజేందర్‌గౌడ్ పాల్గొన్నారు.


